పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

ఉభయసేనలును గురుక్షేత్రము నందు గూడినపిదప నొకనాఁ డుభయబలములను జూచుకొనుటకు యుద్ధభూమి యందు నిలువఁబడియుండఁగా నర్జునుఁడు కౌరవసేనలోని సోదర సుత మాతులా చార్యాదులగు బంధు శిష్ట జనంబులం జూచి వారలఁ జంపుటకు మన సొప్పక నే నిట్టివారి నెటులఁ జంపుదు నని విషణ్ణుఁడయి శ్రీకృష్ణులవారితో మనవిచేయఁగా నవుడు శ్రీస్వామివారు భగవద్గీతల నుపదేశించిరి. ఈగీతలనుఁ బరమేశ్వరుఁ డొక్కఁ డని యొప్పిన యాస్తికమతస్థులందరును గొనియాడుచున్నారు. అందు మనత్రిమతస్థులు నైకకంఠ్యముగ బరమప్రమాణముగఁ దీసికొనియే యున్నారు. ఈగీతోపదేశము కేవలము యుద్ధారంభమునకు ముందుగ జరిగిన దని చదువరులు చాలమంది పొరబాటుపడియున్నారు. అట్లు కాదు.

అ ట్లయినచో యుద్ధారంభసమయమున నాయుధముల విడిచి ధర్మరాజు పాదచారియై భీష్మద్రోణాదులకడ కేగి వారి యనుమతి నేల పొందవలెను ? ఆదినము యుద్ధదినమే యయి యుండినచో వారియనుమతిలేక యుద్ధమునకు వచ్చినవాఁ డయియే యున్నాఁడు. వ్యూహములు తీర్చి సేనలు నిలువఁబడియుండినపుడు యుద్ధమున కనుజ్జు నిచ్చిన యాభీష్మాదు లొకచోట నుండరుగదా! ఆమహాసేనయందు జెదరియున్న వారి యొద్దకు గౌరవతారతమ్యానుసారముగ బోవుట కెంతకాలము