పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

     విను సుప్రసిద్ధుఁడవు నీ
     వని సేసినబేరు నీక యగు నెపాటన్.

వ. నీ కెదురై జయంబు గొనరాదు. అట్లగుటంజేసి విజయ మూలం బగు నీతోడును వలయు, నీవు సమరంబుసేయ కునికియ ప్రియంబు. కావున నిన్నుం గోరికొంటి నని చెప్పి మఱియు ని ట్లనియె.

క. సారథ్యం బొనరింపు మ
    పారకృపాలీల నెల్లభంగుల ననికిన్
    గౌరవమున జిరకాలము
    గోరిన యది దీని నిమ్ము గుణరత్ననిధీ”

అందుకు శ్రీస్వామివా రిట్లు సెల విచ్చిరి.

క. అనిన గిరీటికి హరి యి
   ట్లను నీదగుకోర్కె దీర్చు టది నాకు వ్రతం
   బనఘాతగ సారధ్యం
   బొనరించెద నీకు నసమయుద్ధక్రీడన్.”

ఫలములు కార్యాంతములయందు వారివారిప్రారబ్ధము కొలఁది దటస్థపడినను విరోధులుగానుండి తనయొద్దకు సాయముఁ గోరి వచ్చినయర్జునదుర్యోధనుల నీస్వామి సర్వసముఁడు కావున నే యుభయులను సంతుష్టులగువారినిగఁ జేసిపంపెను.