పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

పట్టును? ఇంతియకాక యిటుల ధర్మరాజు వారివారియనుజ్ఞను బొందివచ్చినపిదప యుద్ధము నారంభింపకముందు దుర్యోధనుఁడు ద్రోణాచార్యునియొద్దకు రథమును దోలించి యతనితో సేనావిషయమైన ప్రస్తావము జేసి యున్నాఁడు. అటుతరువాతనుగూడ నారంభము జరుగలేదు. ఆపయి నర్జునుఁడు తన రథము నుభయసేనలమధ్యమునకు దీసికొనిపోయి యుంచుమని శ్రీకృష్ణులవారిని గోరుటయు నపు డారథముమీఁదనుండి ప్రతిపక్షసేనలోని కావలసినవారినిఁ జంపుట కర్జునుఁడు శంకితుఁ డగుటయు, నట్టివానికి శ్రీస్వామివారు భగవద్గీతల నుపదేశించుటయు జరిగెను.

ఇందుల కెంతయోకాలము పట్టియుండవలెను గదా! అదియే యుద్ధప్రారంభదివసమైనయెడల మీఁదవ్రాసిన విషయములు జరుగుట కవకాశ ముండునా ! యోచింపుడు. అయితే మరియేమి యనిన యుద్ధారంభమునకు ముం దొకనాఁ డుభయపక్షములవారును దమతమసేనలను రణభూమియందు నిలుపుకొని యుద్ధసంబంధమైన యవకాశములను సుళువులను దూరములను జూచుకొన్నట్లు స్పష్టపడుచున్నది.

శ్రీకృష్ణులవారికిని, బాండవసేనకుబ్రభువగు యుధిష్ఠిరునకును గలుగని యీశంక తనవారినిఁ జంపుటకయి యర్జునున కేల గలిగినదో కొంచెము విచారింతము. శ్రీకృష్ణులవారు