పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

తక్కినమువ్వురు దుర్యోధనదుశ్శాసనకర్ణులై యున్నారు. లోకములో మేనమామగుణము లొకనికి సంప్రాప్త మగునపు డామేనమామయొక్క మంచిగుణములు రాక చెడుగుణము లబ్బుటయే తరుచు,

ఇచట దండ్రినిబట్టిచూచినను మేనమామనుబట్టిచూచినను దుర్యోధనదుశ్శాసనులు దుష్టాత్ములు కాకపోవుదురా ! మేనల్లుర మేలుకోరి మొదటినుండి యితఁడు తుదవరకు బాండవులకు గీడు గోరుచు జేయుచువచ్చెను. తుదను యుద్ధమునం దితఁడు సహదేవునిచేఁ జంపఁబడెను.

19. కృతవర్మ.

ఇతఁడు యాదవులలోనివాఁడు. ఒక యక్షౌహిణి సేనతో వచ్చి కౌరవులకు సాయపడెను. శ్రీకృష్ణులవారు రాయభారమునకు వెళ్లినప్పుడు దుర్యోధనాదులు వారినిఁ బట్టుకొన సమకట్టగా వారివెంట వెళ్లిన సాత్యకి తోపాటుగ నితఁడు కౌరవ పక్షమునం దుండియు నాస్వామివారికి సహాయపడుటకు సిద్ధ మయ్యెను.

దుర్యోధనుఁడు పడినపిదప నాఁటిరాత్రి యశ్వత్థామ చేయఁబోవుఘోరకృత్యమునుగూర్చి కృపాచార్యునితోపాటు వల దని యితఁడును జెప్పెను. కాని పాండవులకు ద్రోణుని కంటె బూర్వము గురువగు కృపాచార్యుఁడు పాండవుల