పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

బంపఁబోవునపుడు, దుష్టుఁడైన యీదుర్యోధనుని విడిచివేయుమనియు, జూదమువలన హాని గలుగు ననియు, స్పష్టముగ ధృతరాష్ట్రునితోఁ జెప్పెను. మఱియు శ్రీకృష్ణరాయభారసమయమున నీయమ తనభర్తతో నీవిధముగఁ జెప్పినది :-

తే. గీ. "అనుఁడు నీపుత్రుఁ డవినీతుఁ డగుట యెరిఁగి
        యెరిఁగి వానివశంబున నేల పోయె?
        దీవు పాండవులకు నేమి యిచ్చితేని
        నడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప చెపుమ.”

ఈసందర్భమునను, పైని నుదహరించిన సందర్భమునను, దుర్యోధనునితోను, ధృతరాష్ట్రునితోను, నీమె చెప్పినమాటలు సంస్కృతభారతములో ననేకముగ గలవు. ఈ సమయముల యందేకాక యనేకపర్యాయము లీమె ధర్మమును విడువక పలికి యున్నది.

10. పాండురాజు.

ఈయన విచిత్రవీర్యుని రెండవకుమారుఁడు. తనయన్న యగు ధృతరాష్ట్రుఁ డందుఁ డైనను నతనియెడ గలభక్తిచే రాజ్యభారము నతనియందే యుంచి, దిగ్విజయము చేసి, యన్న యాజ్ఞకు లోబడి, రాజ్యమును బాలించి, యడవి కేగి, యచట మృతుఁ డయ్యెను,