పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

11. కుంతీదేవి.

ఈమె పాండురాజు జ్యేష్ఠమహిషి. వసుదేవుని సహోదరి. కుంతిభోజుఁ డసంతానవంతుఁడై యీమెను బాల్యమునందే తెచ్చుకొని, యభిమానపుత్రికగాఁ బెంచి పాండురాజున కిచ్చి వివాహము చేసెను. ధర్మరాజు, భీముఁడు, నర్జునుఁడు, నను మువ్వురు నీమెకుమారులు. భర్త మరణానంతరమున దన మువ్వురుకుమారులయు, సవతికుమారు లిరువురయు, సంరక్షణముకొరకు హస్తినాపురమునకు వచ్చెను.

12. మాద్రి.

ఈయమ పాండురాజు రెండవభార్య. శల్యుని చెలియలు. నకులసహదేవు లీమెకుమారులు. భర్త మరణానంతరము సహగమనము చేసెను.

13. విదురుఁడు.

ఇతఁడు దాసీపుత్రుఁ డైనసు, బాల్యమునుండి రాజకుమారులతోఁ గలిసి విద్యాభ్యాసము చేయుచు, నస్త్రవిద్యనుగూడ నేర్చెను. బాగుగఁ జదివినవాడు. ధర్మాధర్మవివేకముగల వాఁడు. ధృతరాష్ట్రునకు మనస్తాపము గలిగినపుడెల్లను నితనినే పిలిచి తనమనోవ్యథనుఁ దెలుపుచు నితనివలన జెస్పఁబడు నీతిమార్గములను వినుచుండెను. కాని యెప్పుడు నీతఁడు చెప్పినప్రకారము లేశమాత్రము దిరుగలేదు.