పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

ఆవీరులలో నితఁడు ముఖ్యుడు. ఇట్లే మఱికొన్ని సమయములలో నధర్మయుద్ధమునుఁ జేసియున్నాఁడు

బ్రాహణుఁ డైనవాఁడు స్వధర్మమును విడిచి హింసాకరమైన రాజధర్మమును వహించియుండుట చేతనే యెంత దుష్కార్యము నైనను జేయుటకుఁ దగియున్నాఁడు.

6. కృపాచార్యుడు.

ఈతఁడు బ్రాహ్మణుఁడు. ద్రోణునిరాకకు ముందు నుండియు రాజకుమారుల కస్త్రవిద్య నేర్పుచుండెను. ధర్మరాజు యుద్ధమున కనుజ్ఞ గొనుటకయి యీతనియొద్దకు వచ్చినపుడు, భీష్మద్రోణులవలెనే ముందు వల్లించినమాటల నొప్పగించెను. అభిమన్యువధాదిసమయములలో నధర్మయుద్ధమునుఁ జేసినాఁడు. యుద్ధానంతరము కౌరవసేనయందు మిగిలినమువ్వురిలో నీతఁ డొక్క డయి యున్నాఁడు.

6. అశ్వత్థామ.

ఈయన ద్రోణాచార్యుని కుమారుఁడు. భారతయుద్ధానంతరము కౌరవసేనలో మిగిలిన మువ్వురిలో నీతఁ డొక్కఁడు. దుర్యోధనుఁడు భీమగదాప్రహారమున దొడలు విరిగిపడిన నాఁటిరాత్రి, పాండవ శిబిరములో దొంగవలెఁ జొచ్చి, నిద్రపోవుచున్న మిగిలిన సేనానాయకులను, నుపపాండవులను గొంతులు గోసి చంపెను. కటికివాఁ డైనను నిదురబోవుచున్న జంతువుల