పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

మరువక యథాశ్రుతముగఁ జెప్పినందున నీతఁడు మిగులఁ గొనియాడఁ దగియున్నాఁడు.

4. ద్రోణాచార్యుఁడు.

ఈతఁడు బ్రాహ్మణుఁ డయ్యును ధనుర్విద్యను బాగుగ నేర్చికొని పాండవకౌరవులకే కాక యనేక రాజకుమారులకు విలువిద్య నేర్పెను. భారతయుద్ధములో భీష్మునితరువాత గౌరవ సైన్యాధిపత్యమును వహించి, యైదుదినములు యుద్ధముచేసి పాండవసేనాధిపతియగు ధృష్టద్యుమ్నునిచే దల దునిమి చంపఁబడెను. ఉభయపక్షముల వారికి గురువై యుండియు మొదటి జూదమున భీష్మునితోపాటు వల దని చెప్పియుండలేదు. అర్జునుఁడు తనకు ముఖ్యశిష్యుఁ డైనప్పటికి నరణ్య వాసమునందు శ్రమలకు జడిసియు, తనవిరోధి యగు ద్రుపదుఁడు పాండవపక్షములోనివాఁ డగుటవలన నతనితోఁ బోరాడఁ గోరియు, నీతఁడు పాండవపక్షములోఁ జేరలేదు. ధర్మరాజు యుద్ధముచేయుట కనుజ్ఞ గొనుటకయి తనయొద్దకు వచ్చినపుడు, భీష్మునితోబాటు ముందు వల్లించుకొనినమాటలనే చెప్పెను.

అర్జునునికుమారుఁ డగు నభిమన్యుఁ డేకాకి యై, పద్మ వ్యూహమును భేదించి, దానిలో యుద్ధము చేయునపుడు ధర్మ యుద్దమును మాని, పదిమందియు గలిసి యతనినిఁ జంపిరి