పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

నీతనివలె గోసి చంపఁడు. ఇట్టి యమానుష ఘోరకృత్యము చేసిన యితని నామరుచటిదినమున నోడించి, యితనిశిరోమణినిఁ ద్రౌపది కిచ్చి, యామెదుఃఖమును పాండవు లుపశమింపఁజేసిరి.

7. శల్యుడు.

ఈయన మద్రదేశపురాజు. నకులసహదేవులకు మేనమామ. ధర్మరాజుయొక్క యాహ్వానముచే బాండవపక్షమున యుద్ధముఁజేయుటకు వచ్చుచుండునపుడు, మధ్యమార్గమునఁ దుర్యోధనుని కృత్రిమాతిథిసత్కారమునకు మెచ్చుకొని, పాండవులచేఁ జేయఁబడిన దని భ్రమసి, మోసపోయి, దుర్యోధనుని పక్షమున యుద్ధముచేయుట కియ్యకొని, యుద్ధము చేసెను. కర్ణుని యనంతరము కౌరవసేనాధిపత్యము నొక యర్థదిన మొంది ధర్మజునిచేఁ జంపఁబడెను.

ప్రభు వగువాఁ డనేక రాజభోగముల ననుభవించి యుండియు, వివేకములేక యొకనాఁటి సత్కారమునకు మోస పోయినందున, నీతఁడు తమవారిపక్షమున యుద్ధము చేయక పోవుటయే కాక, యెవ్వరివలన నాహ్వానము చేయఁబడెనో యట్టిధర్మరాజుచేఁ జంపఁబడెను.

8. ధృతరాష్ట్రుఁడు.

ఈయన విచిత్రవీర్యుని జ్యేష్ఠకుమారుఁడు. ఇతఁడు జాత్యంథుఁ డైనను, నితని సోదరుఁడు పాండురాజు దిగ్విజయము చేసి