పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణ.

శ్రీమహాభారత విమర్శము.


1. జనమేజయుఁడు.

ఈయన యర్జునుని ప్రపౌత్రుఁడు. తనతండ్రి యనంతరము వ్యాసునిశిష్యుఁ డగు వైశంపాయనునివలన మహాభారతకథను వినెను.

తమ పూర్వులచరిత్రమును వైశంపాయనునివలన నీతఁడు వినినందున నాకథ లోకమునఁ బ్రచురపరుపఁబడినది. అటుల లేనిచో నాచరిత్ర కాలక్రమమున మరువఁబడవలసినదియే కదా? కావునఁ బ్రసిద్ధవంశజులు వారివారి పూర్వులచరిత్రలను గ్రంథస్థము చేసియుంచుట యావశ్యకము.

2. పరీక్షిత్తు.

ఈతఁ డర్జునుని పౌత్రుఁడు. తన పెద్దతాతయగు ధర్మజునితోఁబాటు ధర్మపరిపాలనఁ జేసినవాఁడు. కుమారునికి రాజ్యము నొప్పగించి తనతాతలతోఁబాటుగ నరణ్యమున కేగి యచట నొకసర్పముచేఁ గఱచి చంపఁబడెను. ఈపాముకాటునకు శాపమని యొకకథ కల్పించి చెప్పఁబడినది.