పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఎంతగొప్పవా రైనను దుష్టజంతువుల విషయమున మిగుల జాగ్రత్తగా నుండునది.

3. భీష్ముడు.

ఈయన శంతను చక్రవర్తియొక్క. జ్యేష్ఠకుమారుఁడు. భారతయుద్ధములోఁ బదిదినములు యుద్ధముఁ జేసి గాయములచే యుద్ధభూమినుండి వెడలి మాఘశుద్ధేకాదశినాఁడు ప్రాణత్యాగమునుఁ జేసెను. యుద్ధానంతరము ప్రాణత్యాగ కాలములోగా ధర్మరాజునకు శాంతి, ఆనుశాసనికి, పర్వములలోని యనేకనీతులనుఁ జెప్పెను.

తండ్రియొక్క యాజ్ఞకు బద్ధుఁడయి వివాహ మాడక రాజ్యమును దనసవతితల్లికుమారునకు విడిచిపెట్టెను.

ద్రౌపదీవివాహానంతరము పాండవులు ద్రుపదునిపురమున సుఖముగ నున్నా రని విన్న కాలమున వారినిఁ దెచ్చి వారివంతు రాజ్యము వారి కిచ్చివేయు మని యీభీష్ముడు చెప్పెను. పాండవులు బాల్యమున వారణాశ్రమమున లక్క యిండ్లలోఁ బెట్టి చంపఁబడి రని యదివరకు నమ్మియున్న వాడు గాన నిపుడు వారు సుఖజీవులయి యున్నా రని విని తత్కాలమునుబట్టి స్వచ్ఛమైన హృదయముతోనే యిట్లు చెప్పె నని నమ్మవలసి యున్నది,