పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఉపోద్ఘాతము.

వచ్చును. వానివిషయములోనును జదువరులు మీఁద వ్రాసిన కారణ సంప్రదాయములనుఁబట్టి యోచించినచో నిటులనే కల్పితగాథ లని తోఁచక మానదు.

మఱియు నీగ్రంథకర్తకు యుద్ధసంప్రదాయమే, తెలియదు. యుద్ధవిషయములో ననేకపర్యాయముల సంభావితములను జెప్పియున్నాఁడు. వాని నిచ్చట వివరించుట కవసరము లేదు. చదువరులు కొంచెము విచారించినయెడల బోధపడగలదు. అయితే బ్రాహ్మణులకు యుద్ధముయొక్క వేటలయొక్క సంప్రదాయములు తెలియనివారలకు నిట్టివి మనస్సులకు వచ్చుట గష్టముగ నుండు నని తలఁచెద.

ఈగ్రంథకర్త కౌరవపక్షపాతీయే కాక యద్వైతి యనియు ముందుఁ చెప్పియుంటిని, అద్వైతి యనఁగా జీవేశ్వరాభేద బుద్ధిముదిరిన వెఱ్ఱి యద్వైతి కాఁడు. మఱి యేమి యనిన శివ

ఇంక నెవ్వరెవ్వరిచరిత్రములవలన నేమేమి మంచిచెడుగులనుఁ గ్రహింపవలెనో యావిషయమును వ్రాయుట కుపక్రమించెదను,