పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

9

నుండునా ? ఈగ్రంథకర్త కెంతపిచ్చి ! మరియు శ్రీస్వామివారు పాండవులను రక్షింపఁ బూనుకొని యుండి వీరి కిట్టితుచ్ఛమైన పనినిఁ జేయు మని చెప్పుదురా ? ఒకవేళ ధర్మరాజు భీష్ముని యాటోపమునకు జడిసియుండినను బీమార్జును లాముసలివానికి జడియుదురా! కావున నిదియుఁ గల్పితకథయే యయి యున్నది. ఎందుకు జెప్పఁబడిన దనఁగా : శ్రీపరశురాముని జయించినవాఁడును స్వచ్ఛందమరణముగలవాఁడును నగు నీతనినిఁ జయింప నీయర్జునునకు శక్యముగాదు కావున నిట్టిప్రార్థనవలన భీష్ముడు మడిసె నని చెప్పుటకుగా కథ కల్పింపఁబడినది.

4 అర్జునుఁడు శిఖండిని ముం దిడికొని భీష్ముని గ్రిందఁ బడువరకు బాణములతో గొట్టె నని యున్నది. మహావీరుఁడగునర్జునుఁ డొకనిచాటున నుండి మృగమును గొట్టినట్లు చేయఁబూనునా ? ఈకథయు భీష్మునియాధిక్యముకొరకు గల్పింపఁ బడిన ట్లున్నది. కాని నేను వేరొక యభిప్రాయమునుఁ దీసికొని యెదను. అర్జునునియందు భీష్మున కతిప్రేమ గలదు. ఎప్పుడు వీరిరువురు నెదురుకొనినను నెదిరించి నిలువఁబడి యుద్ధము చేయక యస్త్రమునకు బ్రత్యస్త్రమునుమాత్రము వేయుచు దాటిపోవుచుందురు. శిఖండి స్వతః భీష్ముని బడఁద్రోయునంతటి వీరుఁడు గాకపోయెను. అందువలన నీభీష్మునికి బరమశత్రువగుశిఖండిప్రక్క జేరి యర్జునుఁడు యుద్ధము చేసెను. శత్రువు