పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఉపోద్ఘాతము.

ప్రక్క నుండి యుద్ధముచేయు నీతనిని మునుపటివలె బ్రేమతోఁ దప్పించిపోలేక నిలువఁబడి కోపముతో రణము చేసెను. అదియేసమయముగ నర్జునుఁడు తీసికొని భీష్మునిఁ గూల్చెను. సంగతి సందర్భములనుఁ గొంచెము యోచించువారికి శిఖండిప్రక్కనుండి యర్జునుఁడు భీష్మునిఁబడఁద్రోయుట కిదియే కారణమని తోఁచక మానదు.

5. భగదత్తునిచే నర్జునునిమీఁద వేయఁబడినవైష్ణవాస్త్రమును శ్రీకృష్ణులవారు రధముపైని నర్జునునకు నడ్డముగ నిలువఁబడి పూలదండనుగాఁ జేసికొని రని యొక చోటఁ జెప్పఁబడి యున్నది. ఆభగదత్తుఁ డెంతయవివేకి విష్ణుసంబంధమైన యస్త్రమును విష్ణుఁడు ముందు గల యర్జునునిమీఁద విడువఁ దగునా ! ఆ యస్త్రమే శ్రీకృష్ణులవారిమెడను బూలదండగాఁ బరిణమించి యుండును గాని శ్రీకృష్ణులవా రడ్డముగ నిలిచి యుందురా! ఆభగదత్తుని యవివేకము నుభయపక్షముల వీరులకుఁ జూపుటకుఁ బూలదండగ నైనపిదప రథముపయి నిలువఁబడి యుందురు. లేదా అటుల స్వామివారు చేయక పోయినయెడల నర్జునుఁ డాయస్త్రము చేతనే మడిసియుండు నని చెప్పుటకు గల్పింపఁబడినకథగా నుండును.

6. సైంధవవధ నాఁటిముందురాత్రి స్వప్నమునం దర్జునుఁడు కైలాసమునకుఁ బోయి యీశ్వరునివలనఁ బాశుపతాస్త్ర