పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఉపోద్ఘాతము.

బడసెననియు, నింద్రాదులకు జంప శక్యముగాని నివాతకవచులను రాక్షసులను సంహరించె ననియుఁ జెప్పఁబడియున్నది. ఈకథ యెందుకు గల్పింపఁబడినదో చూతము. ఎవ్వఁడైన మనుజుఁడు తనమానవశరీరముతో స్వర్గాద్యూర్థ్వలోకములకుఁ బోవుటకు వీ లుండు నని పూర్ణముగఁ జదివినపండితు లంగీకరింతురా ? మరి యేమి యనిన , అమానుషమైన స్వర్గారోహణముఁ జేసి యింద్రాదులకుఁ జయింప శక్యముగాని యారాక్షసులను జంపి యింద్రునివలన నస్త్రలాభము నొందిన సమర్థుఁడు గావుననే కర్ణాదులను భారతయుద్ధమున నితఁడు చంపె నని కౌరవుల యాధిక్యముకొర కీకథ చెప్పఁబడినది. సాధారణముగ జదువువార లర్జునునియాధిక్యమునుఁ దీసికొనియెదరు. సఖుఁడైన సర్వేశ్వరుఁ డతనికి సారథి యై యుండఁగ మరియొకరిసాహాయ్యము గావలెనా?

3 భీష్మునిపరాక్రమమునకు జడిసి యతనినిఁ జంపఁజాలమని తలఁచి శ్రీకృష్ణులవారిపనుపునఁ బాండవులు నీచావువిధమునుఁ జెప్పు మని యతనియొద్దకు రాత్రివేళ బ్రచ్ఛన్నముగఁ బోయి చెప్పుకొని ప్రార్థించినటులఁ జెప్పఁబడి యున్నది. యుద్ధదివసములలో నట్లు వైరులశిబిరములకుఁ బోవుటకు వీలు పడునా ! ఏదియేనిఁ దెలిసికొనవలసి యుండినయెడల సర్వజ్ఞులగు శ్రీస్వామివారికిఁ దెలియనిది భూతభవిష్యద్వర్తమానములలో నేదియైన