పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169

ముక్తికి బ్రధానమని యెంచి యట్లు బోధించుచు నది యెనిమిది విధములని వివరించెను. అవి యెవ్వియనిన :-

1. సత్యసంకల్పము, 2. సత్యనిశ్చయము, 3. సత్యవాక్కు, 4. సత్యప్రవర్తనము, 5. సత్యజీవనము, 6. సత్యప్రయత్నము, 7. సత్యగ్రహణము, 8. సత్యపర్యాలోచనము ఈయంశములను బుద్ధుఁడు బోధించినను బ్రతిమనుష్యుఁడును ముఖ్యముగ బరిగ్రహింపవలెను. యుక్తప్రవర్తనములేని యారాధనాదు లెందుకును బనికిరావుకదా!

రేపు జరుగునదియె తెలియరాని మనకు ముందు కొబోవునని యూహించి గ్రంథకర్తలచే జెప్పఁబడిన కల్క్యవతారముతో బనియేమి ? కావున భగవదవతారములని చెప్పఁబడిన యన్నిటిలో శ్రీరామకృష్ణావతారములే నిజమైన యవతారములని నమ్మవలయును. శ్రీరామకృష్ణుల యవతారముల యనంతరము వారివారి విగ్రహములను బ్రతిష్ఠించి పూజించుచున్నాము. నరశరీరములను దాల్చిన వారిమూర్తులేల పూజనీయము లయ్యెననగా ? శ్రీకృష్ణులవారు వైకుంఠమునకు విజయము చేయుటకుముందు వారిని విడిచియుండజాలనని మొఱ్ఱపెట్టుకొన్న తనసఖుఁ డగునుధ్ధవునకు దమయవతారానంతరమున దమ రూపమువంటి యాకారము గలవిగ్రహములను జేయించుకొని యథావిధిగ నారాధించుచుండినయెడల నిహముపరము