పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

ఈబుద్ధుఁ డొకానొకసమయమునుబట్టి బౌద్ధమతము నుపదేశించినట్లు మనగ్రంథములలో నున్నది. అతనియనంతరమున నామతస్థులందఱు నతని నఖరోమాదులను నతని యాభరణాదులను నతిభక్తితో నారాధించుచు నుండఁగా శ్రీశంకరాచార్యులవా రతఁడే మావిష్ణువుయొక్క, యవతారమని చెప్పి చాలమందిని మనమతములోనికి దిరుగవచ్చునట్లు చేసిరని పశ్చిమఖండపు నవీనగ్రంథకర్తలు కొందఱు వ్రాసియున్నారు. బహుశః ఇదియే నిజమైయుండును. ఏమియనిన, జగదీశ్వరుఁడు సంహరించునూహతో వంచనచేసి నాస్తికమతము నుపదేశించి యుండునా ! ఏమియాశ్చర్యము ?

శంకరాచార్యులవారు నాస్తికమతఖండనముకొఱకు బౌద్ధమతాచార్యుని మావిష్ణువుయొక్క యవతారమని బోధించుటయేగాక యప్పటికి వేరువేరుగ బంచదేవతల నారాధించు చుండునట్టి మనమతస్థుల నందఱిని నేకీభవింపఁజేయుటకయి పంచదేవతారాధనము నుపదేశించి యతియగు తానును నట్లారాధించియుండెను.

ఈ బుద్ధుఁడును దేవుఁడు కలఁడా! లేఁడా? యనువిషయమును జర్చింపక యప్పటిప్రజలు యజ్ఞాదికర్మములవలననే తమకు సమస్తము లభించునని నిండునమ్మికతోనుండి తమప్రవర్తనల విషయమున నజాగ్రత్త గలిగియుండుటచే యుక్తప్రవర్తనమే