పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

గలదని యానతిచ్చియున్నారు. కావున నిట్లనే శ్రీరాములవారి నిష్టదైవముగ నారాధించువారు వారివిగ్రహములను గొల్చుచున్నారు.

విగ్రహారాధనము లేనియెడల బండితపామర సాధారణముగ మనసునిలిపి భగవంతుని ధ్యానించుట యసాధ్యము కావున మనము విగ్రహారాధనము చేయుదుమని యితరమతస్థులు మనల నాక్షేపించుట సరికాదు. బౌద్ధమతస్థుల తోబాటుగ మహమ్మదీయులు ముహమ్మదుయొక్క నఖరోమాదులను బూజించుచున్నారు.

క్రైస్తవు లామతాచార్యుని మేకుబందీచేసిన త్రిభుజాకారము (క్రాన్) గలకఱ్ఱను వారి దేవళములమీఁద నుంచుకొనుచున్నారు. కేవల శైవులు లింగమును గట్టుకొన్నట్లు పాదిరులు త్రిభుజాకారముగల లోహపుదునుకను ధరించుచున్నారు. మఱియు పాదిరిగుడులలో నద్దపుతనాబీలయందు క్రైస్టుయొక్కయు నతనితల్లి యొక్కయు రూపము లమర్పఁబడి యున్నవి.

లోహసంబంధమైన త్రిభుజాకారముగల కఱ్ఱలను గురువులుపదేశించుచోట నుంచియున్నారు. వీరిలో విగ్రహారాధనము నంగీకరించిన రోమన్ కాతలిక్ పాదిరు లించుమించు మనతో బాటుగనే విగ్రహారాధనమే చేయుచున్నారు. తక్కినమతస్థు