పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

163

హంసావతారము, 17. మన్వంతరావతారము, 18. ధన్వంతరి, 19. పరశురాముఁడు, 20. శ్రీరాములవారు, 21. శ్రీకృష్ణులవారు, 22. వ్యాసులు, 23. బుద్ధుడు, 24 కలికి.

ఈ పయి రెండవతారకథలలో సంఖ్యా భేదము, వరుసభేదము, వ్యక్తి భేదమునుగలవు. సర్వసాధారణముగ ననేక గ్రంథములలో మత్స్యకూర్మాది దశావతారములే యొప్పుకొనఁబడి యున్నవి భగవద్గీతలలో నప్పటికాలపు బ్రజలవలన దేవతిర్యఙ్మనుష్య స్థావరములలో నేవేవి పూజనొందుచు గౌరవింపఁ బడుచుండెనో యవియన్నియు జెప్పుచు నేదియేది మహిమయు సంపదయు గౌరవమును గలిగియుండునో దానియందెల్లను నాయంశము గలదని యెంచుకొనుమని శ్రీకృష్ణులవా రర్జునున కానతిచ్చియున్నారు.

శ్లో. "యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జిత మేవవా!
    తత్తదేవావగచ్ఛత్వంమమతేజోంశసంభవమ్ !!"

ఈవాక్యము నాధారముచేసికొని భాగవతగ్రంథకర్త భగవదంశ కలదని తాను నమ్మియున్న యిరువది యొక్కరిని ముందుగ జెప్పి పిదప మఱికొందరిని జ్ఞప్తికి దెచ్చుకొని కేశవాది చతుర్వింశతి నామములకు సరిపడున ట్లిరువదినలుగురిని భగవదవతారములని రెండవసారి చెప్పెను. కాని ముందు చెప్పిన పేరులను గమనించియున్నట్లు కనబడదు. ఇప్పటికిని