పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

మన మతగ్రంథములయందుఁ జెప్పఁబడినవానిలో నేవి ముఖ్యములో వానిని మనము తప్పక విచారింపవలసియున్నది.

భాగవతమున సూతుఁడు శౌనకాదిమునులకు జెప్పుటలో నిరువదియొక్క యవతారములుగ గనఁబడుచున్నది. అవి యెవ్వియనిన:-

1. బ్రహ్మ, 2. యజ్ఞవరాహము, 3. నారదుఁడు, 4. నర నారాయణులు, 5. కపిలుఁడు, 6. దత్తాత్రేయుఁడు, 7. సుయజ్ఞుఁడు, 8. ఋషభుఁడు, 9. పృథుచక్రవర్తి, 10. మత్స్యావతారము, 11. కూర్మము, 12. ధన్వంతరి, 13. మోహిని, 14. నృసింహావతారము, 15. వామనుఁడు, 16. పరశురాముఁడు, 17. వ్యాసులు, 18. శ్రీరాములవారు, 19. బలరాములవారు, 20. శ్రీకృష్ణులవారు, 21. బుద్ధుఁడు.

మరియు నాగ్రంథముననే నారదునకు బ్రహ్మచెప్పినట్లున్న కథలో నిరువదినాలుగవతారములుగఁ జెప్పఁబడియున్నది. అవి యెవ్వియనిన :-

1. యజ్ఞవరాహము, 2 సుయజ్ఞుఁడు, 3. కపిలుఁడు, 4. దత్తాత్రేయుఁడు, 5. కుమారావతారము, 6. నరనారాయణులు, 7. ధ్రువుఁడు, 8. పృథుచక్రవర్తి, 9. ఋషభుఁడు, 10. హయగ్రీవుఁడు, 11. మత్స్యము, 12. కూర్మము, 13. నృసింహావతారము, 14. హరియవతారము, 15. వామనుఁడు, 16.