పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

గొప్పప్రభువులను గొప్పవిద్వాంసులను భగవదంశము గలవారని వాడుచున్నాము. ఇంక దశావతారవిషయము చర్చింప వలసియున్నది. మీద జెప్పఁబడిన యిరువదియొక్క యవతారములలో దశావతారములలోని చివరది యగుకల్క్యవతారములేదు. తిరుగ నిరువదినాలు గవతారములుగ జెప్పుటలో నాగ్రంథకర్తముందుచెప్పిన బలరాముని విడిచెను. ఇందునుఁ బట్టిచూచినను దశావతారవిషయములో బాగుగ జర్చింపవలసినట్లున్న ది. వీనిలో మత్స్యావతారము ముందుగ గలిగినదని చెప్పుదురు. మత్స్యమనునది కేవలము నీటిలో నుండఁదగినది యైయున్నది. కావున నీయవతారము సృష్ట్యాదియందావిర్భవింపవలసి యుండును. ముందుగ జలగోళములసృష్టి జరుపఁబడినది. ఆపిదప బంకాదులు పుట్టెను. అటుతర్వాత నడవులు, కొండలు, మృగములు, వృక్షపక్ష్యాదు లుత్పన్నము లయ్యెను. అటుపిమ్మట దామస రాజసుల సృష్టి, జుగుపఁబడినది. ఇందునుబట్టి కొంత విచారింపగ నరసృష్టికి బూర్వము భగవంతుఁ డవతరించుటకు బ్రసక్తి కనఁబడదు. అయితే మరి యెందువలన నిట్లు నమ్మియుండిరన, గీతలలో శ్రీకృష్ణులవారు :

శ్లో. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్ !
    ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!!"