పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ఉపోద్ఘాతము.

కథను వైశంపాయనుఁడు గ్రంథరూపముగఁ జెప్పియుండ వచ్చును. లేదా మనపురాణము లన్నియు వ్యాసప్రోక్తములుగాఁ జెప్పినటుల వ్యాసులవారివలన వినిన ట్లారోపించి వైశంపాయనులవారు చెప్పియుండవలెను. ఎవరు చెప్పియుండినను నాచర్చతో మన కేమిపని? కావున నెవ్వరు చెప్పియున్నను నాగ్రంథకర్త కౌరవపక్షపాతియు, నద్వైతియు నై యున్నాఁడు. ఇందు మొదటివిషయము చర్చించునపు డాగ్రంథములోని చాలయసందర్భములు బయలఁబడును. వానిని ముఖ్యముగ నాగ్రంథమును జదువువారును వినువారును దప్పక గమనింప వలసి యున్నది.

ఈగ్రంథ మనేకేతిహాసములు, రాజవంశముల వృత్తాంతములు, నీతులు, ధర్మములు వీనితో నిండియున్నది. అందుచే దీని నైదవవేద మని చెప్పుదురు.

ఒకరితో నొకరు సంభాషించునపు డెల్లను నీతితోఁ జేరని మాటలే తరుచుగ నుండవు. ఎదురువాదపు సమయములలో నిరుప్రక్కలవారు చెప్పెడినీతులు వినఁగనే బహుప్రశస్తముగ దోఁచును. చదువరులకును వినువారికిని నబ్బురపాటుగ నుండును. కావున నెవ్వరెవ్వరిచరిత్రములవలన మన మేమేమి గ్రహింపవలెనో దానినిఁ జూవుట కీగ్రంథమును వ్రాయఁబూనితిని గాని యన్నినీతులను ధర్మములను జెప్పుటకు గాదు. వానినిఁ