పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

5

దెలిసికొనుటకు శ్రీభగవద్గీతలు శాంత్యాను శాసనికములే చాలును.

శాంత్యానుశాసనికములలో భీష్ములవారు ధర్మరాజుతోఁ జెప్పినవి కొంచెము ఛాందసముగాను, పరస్పరవిరుద్ధముగాను పునరుక్తముగాను గనుపడును. వారియిరువురిమధ్యను జరిగిన సంభాషణ యొక్క నాటిది గాక యనేకదినములు జరిగినదగుట చేతను, ధర్మరాజును నడిగినప్రశ్నమునే పలుమారు వేరొక సందర్భములో వేరొకవిధముగ నడుగుటచేతను, భీష్ముఁడు తన యాదినిబట్టి మాటలుగాఁ జెప్పుటచేతనుఁ బయిని వ్రాసినట్లుండును. అంతమాత్రముచేత భీష్మునియందుఁ దప్పు నెంచఁ గూడదు.

మాక్సుముల్లరుగారి యాజమాన్యముక్రిందఁ బుట్టిన పవిత్రమైన తూర్పుదేశపుగ్రంథము లనేనామముతో నున్న గ్రంథములలో గీతలు, సనత్సుజాతీయము అనుగీతలు గల పుస్తక మొకటి గలదు. ఆమూడింటి యుపోద్ఘాతములను నింగ్లీషు నేర్చిన మనయార్యమతస్థులందరును జదువఁ గోరుచున్నాఁడను. ఆగ్రంథకర్త సనత్సుజాతీయము అద్వైతమతాభిమానిచే నిటీవలఁ జెప్పఁబడి భారతమునఁ జేర్పబడిన దని బహువిధముల సాధించెను. అటులనే యనుగీతలను నవి మరియు నిటీవల ననఁగా బౌద్ధజైనమతములు పుట్టినపిదపఁ జెప్పఁబడి యీ