పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము.

3

మాత్రము నిజముగ జరిగిన వని నమ్మగూడదు. ఇంక మతసంబంధపు నమ్మికలు ప్రతిమతమందును గొన్ని గలవు. వానిని నమ్మకపోయినయెడల యేమతమును నిలువఁబడదు. అందు మన యార్యమత మాది దగుటచేత హెచ్చుగ నున్నవి. అవి యెవ్వి యనిన :- అంతరిక్ష గమనము, కామరూపము, తపోమహిమ, వరప్రభావము, ఊర్ధ్వలోకవాసుల యాగమనము, భగత్ప్రత్యక్షము, భగవత్సాహాయ్యము, అదియు ప్రత్యక్షపరోక్షకృతము, దీర్ఘకాలజీవితము, స్వచ్ఛందమరణము వీనిని మనము తప్పక నమ్మవలెను. అందు స్వచ్ఛందమరణము సరిగ జరుపఁబడక పోయినయెడల నాత్మహత్యలోనికిఁ జేరును. భీష్మునిది యటుల కాదు. ఏ మనిన; పోవుటకు సిద్ధముగ నున్నప్రాణమును నేకాదశివరకు నిలిపియుంచెను.

శ్రీమహాభారత విషయము.

జనమేయమహారాజు తనకు మహాభారతకథను జెప్పుమని వ్యాసులవారి నడుగ నతఁ డాకథ నామహారాజున కెఱింగింపు మని వైశంపాయనమహర్షిని నియోగించినటులను నాఋషి యీభారతకథను జెప్పినటులను గానిపించుచున్నది. వ్యాసులవారు ముందుఁ జెప్పినదానినే వైశంపాయనుఁడు చెప్పి యుండిన నుండవచ్చును. లేదా వ్యాసులవారివలన వినియున్న