పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

ఉపోద్ఘాతము.

సృష్టియు, నాపైని గలిగెడువస్తుజీవసృష్టులు, సూర్యచంద్రవంశములు, తత్తద్వంశీయుల వృత్తాంతములు మన్వాదులకాలములు నను నైదులక్షణములు గలిగియుండవలెను ధర్మార్థ కామమోక్షముల నుపదేశించు పూర్వకాలపుగథలతో నిండియున్నది యితిహాసము, వ్యంగ్యముగా నీతిని బోధించునది కావ్యము. శ్రీమద్భాగవతాదికములగు పదునెనిమిదిపురాణములకుఁ బురాణ లక్షణములుగల వనియెదరు. ఇతిహాసలక్షణము గలది మహాభారతమని చెప్పుదురు. శ్రీమద్రామాయణమును గావ్య మని నుడివెదరు. ఈ విభాగములతోఁ బని కవులకే గాని మనవంటి చదువరులకు లేదు. పైనిఁ జెప్పఁబడిన త్రివిధగ్రంథములయందును ధర్మార్థకామమోక్షములను బోధించు పూర్వరాజులచరిత్రలు, వంశానుక్రమములు సమముగనె యున్నవి. మఱియు నీ మూడువిధములయిన గ్రంథములయందును ననేకగాథలు మత సంబంధపు నమ్మకములును గలవు. కావున వానిని ముందుగఁ జెప్పవలసియున్నది. అందు గాథ లైదువిధములు. వాని నిజముగజరిగినవానిగా మనము తీసికొనఁగూడదు. అవి యెవ్వి యనిన :-1. నీతిబోధకములు, 2. ఆధిక్యమును దెచ్చుకొరకు జెప్పఁబడినవి. 3. ప్రశ్నకు సమాధానముగా నుండునవి, 4. గ్రంథకర్తలు పడినదురభిప్రాయములను బలపరుచుటకుఁ జెప్పఁబడినవి. 5. అవివేకపునమ్మకములతో నున్నవి. వీనిని మన మెంత