పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141

తోఁగూడ దుఃఖించి తల్లిని నిందించి తండ్రికి నుత్తరక్రియలను సలిపి వశిష్ఠునివాక్యప్రకారము రాజ్యమును స్వీకరింపనొల్లక యారాజ్య మేలుటకు శ్రీరాములవారే యర్హులని నిశ్చయించి వారియొద్దకుం బోయి ప్రార్థించి తీసికొనివచ్చుటకయి పరివారసహితుఁడై కదలెను. ముందు సుమంత్రునివలన జిత్రకూటాద్రివరకు శ్రీస్వామివా రేగినట్లు తెలిసికొనియున్నందున జిత్రకూటాద్రిఁ జేరెను. శ్రీరాములవారికొరకు సపరివారముగాఁ బోవుచున్న భరతునిఁ గంగానదియొడ్డున గుహుఁడు చూచి శ్రీస్వామివారియందు గల మిత్రభావముచే వారికిఁ గీడు చేయునేమో యని శంకితుఁడై భరతునిఁ గంగానది దాటుట కాటంకపరుపఁ బ్రయత్నించెను. అపు డాతనివలన నిజస్థితినిఁ దెలిసికొని పరివారసహితముగా నతనిని గంగానదిని దాటించి పంపెను. ఇట్లు పరివారసహితుఁడై వచ్చుచున్న భరతుని లక్ష్మణస్వామివారు చిత్రకూటాద్రిపయినుండి దూరమునఁ జూచి, వచ్చువాఁడు భరతుఁడని తెలిసికొని శ్రీస్వామివారి కపాయము చేయఁబూని వచ్చుచున్నాఁడని భ్రమసి శ్రీరాములవారితోఁ 'భరతుఁడు నీమీఁదికి యుద్ధమునకు వచ్చు చున్నాఁడు సిద్ధుఁడవు గమ్ము నేను ముందుగ సేనను దగిలి యుద్ధముచేసి భరతాదులను సంహరించెద' నని మనవి చేసెను. అపుడు శ్రీస్వామివారు భరతునకు నామీఁద గల