పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

భక్తిని నీవెఱుఁగ వనియు నేను నీ కారాజ్యము నిమ్మని చెప్పినయెడల భరతుఁ డిచ్చు ననియు సమాధానపరచిరి. అంతలో భరతశత్రుఘ్నులు దూరమున రథము డిగి పాదచారులై సన్నిథిఁ జేరి శ్రీస్వామివారిపాదములకు భక్తిలజ్జాశోకపరవశులై సాష్టాంగవందనము చేయ వారలను బ్రీతిపురస్సరముగ నెత్తి కౌఁగిలించుకొనిరి. అపుడు భరతునిం జూచి తండ్రియగు దశరథుని నేల యొంటరిగ విడిచి వచ్చితి వనియు, తండ్రియుఁ దల్లులు సుఖముగ సున్నారా ! యనియు వారిని నిత్యమును యథావిధిగ బూజించుచున్నావా యనియు, నని యనేక రాజ్యాంగవిషయకప్రశ్నముల సడిగిరి.

తండ్రియొక్క క్షేమమునకుగా భరతు నడిగినప్రశ్నమునకు నుత్తరమును దీసికొనక రాజధర్మములను దెలుపుప్రశ్నములను విపులముగ నేల యడిగిరో విచారింపవలసి యున్నది. ఇవుడు భరతుఁడు శ్రీస్వామివారియొద్దకు వారినిఁ బ్రార్థించిన పయిని దప్పక వారు రాజ్యమును స్వీకరింతు రనెడు నమ్మికతో వచ్చియున్నాఁడు. రాజ్యమును స్వీకరింప నని చెప్పిన పిదప నతనిమనస్సు వికలమై యుండును. అపు డీరాజధర్మ విషయములు బాగుగ మనస్సునందు బట్ట వని శ్రీస్వామివారు తలఁచియు జగదీశ్వరుఁడు గావున దండ్రివిషయము తెలిసియే యుండుటచే నావిషయమున కుత్తరమును విన్న పిదప మానవ