పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

లేనందున మంత్రులు యోచించి యాకళేబరమును భద్రపరచి మాతామహుని యింటనున్న భరతునిశత్రుఘ్నునితో రప్పించిరి. అట్లు వచ్చి భరతుఁడు దహనాదిసంస్కారములు యథావిధిగ జరిపెను. అప్పటియాచారమువలననే యిక్కాలమునను యూరపుఖండపు రాజులకళేబరములను బంధువులందఱు వచ్చువరకు ఖననము చేయక యుంచుటఁ గలదు.

స్వల్పదినములక్రిందట నరణ్యవాసమున కేగిన జ్యేష్ఠకుమారులగు శ్రీస్వామివారినిమిత్తము మనుష్యులను బంపక యేడుదినముల ప్రయాణముగల మాతామహుని పురమున నున్న భరతుని నేల వశిష్ఠాదులు రావించి రని కొందఱికిఁ దోఁచును, శ్రీస్వామివారికొరకు మనుష్యుల నంపకపోవుటకు రెండుకారణములు గలవు :- 1. రాజ్యమును విడుచుకొని పదునాలుగుసంవత్సరము లరణ్యమునందే కాని యేపట్టణము నందును వసింపనని చెప్పిపోయిన శ్రీస్వామివారు రా రనియు, 2. చిత్రకూట పర్వతము దాటి యేప్రక్కకు వారు పోయిరో యామార్గమును దూతలు తెలిసికొనుట దుర్లభ మనియు వీనిని యోచించి నిర్దిష్టమైనస్థలమునం దున్న భరతశత్రుఘ్నులను బిలువనంపియుందురు.

భరతుఁడయోధ్యాపురముఁ జేరఁగనే తనతల్లివలనఁ ద్రండి మరణమును, అన్నయొక్క వనవాసగమనమును విని, తమ్ముని