పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135

మహారాజు సీతాదేవిని శ్రీరాములవారికిని, రెండవపుత్రికయగు నూర్మిళను లక్ష్మణస్వామివారికిని, దనతమ్మునికుమార్తెలగు మాండవీశ్రుతకీర్తులను వరుసగ భగతశత్రుఘ్నులకును నిచ్చి యేక కాలమున నతివిభవముతో వివాహము చేసెను.

భర్త సంచరించువిధమునకు శ్రీరాములవారును, భార్య ప్రవర్తించురీతికి సీతాదేవియు, సోదరులను వర్తించుటకు లక్ష్మణస్వామియు, భక్తికి భరతుఁడును, నిదర్శకులయి ప్రవర్తించిరి.

ఇట్లు వివాహములు జరిగినపిదప దశరథమహారాజు కుమారులతో ను గోడండ్రతోను బరివారముతోను నయోధ్యాపురము జేరి సుఖముగ నుండెను.

ఈతీరున గొన్ని సంవత్సరములు జరిగినపిదప భరతుఁడు శత్రుఘ్నుసహితుఁడై మాతామహుఁడగు కేకయరాజుపురమున కేగియుండఁగా దశరథమహారాజు తాను మున్ను కైకేయి కిచ్చినవరమును దలఁచి భరతుఁడు లేని యిదియే సమయమని యెంచి ! శ్రీరాములవారికిఁ బట్టాభిషేకము జేయఁ బూని వశిష్ఠమహర్షి చే నందుకు ముహూర్తమును నిర్ణయింపించి సంభారములు సిద్ధపరచి మరునాఁడు చేయ సమకట్టియుండెను. ఆనాఁటిరాత్రి కైకేయి తనకు ముందు భర్తచే నీయఁబడినవరముల నడుగుటవలన మరునాఁడు జరగవలసిన శ్రీరామపట్టాభిషేకము నిలిచిపోయెను. ఈవరముల విషయము దశరథమహా