పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

వాఁడు రామబాణములకుఁ దాళఁజాలక తప్పించుకొనిపోయెను. రెండవవాఁడు హతుఁ డయ్యెను.

అక్కాలమునఁ జనకమహారాజుచేఁ జరపఁబడుచున్న యజ్ఞమును జూచుటకును నామహారాజుయొద్ద నున్న యీశ్వర ధనుస్సును గాంచుటకును విశ్వామిత్రునివెంట శ్రీరామలక్ష్మణులు మిథిలాపురమున కేగిరి. ఆకుమారుల నామహారాజు చూచి వీ రెవ్వ రని విశ్వామిత్రుని నడుగ 'వీరు దశరధమహారాజు కుమారులు, ధార్మికులు, ధనుర్విద్యయందు నేర్పుగలవారు, నీయింట నున్న శివధనుస్సును జూడ నభిలాషముగలవారై వచ్చి'రని యతఁడు చెప్పఁగా నామహారాజు చాల యానందించి యాధనుస్సునుఁ దెప్పించి దీనిని శ్రీరాములవా రెక్కు వెట్టిన యెడల వీర్యశుల్కగా నిచ్చుటకు శపథము చేసియున్న తనకుమార్తెయగు సీతాదేవి నిచ్చెద నని చెప్పెను. అపుడు శ్రీరాములవా రతిసులభముగ దాని నెక్కు వెట్టుతరి నది నడిమికి విరిగిపోయెను. దానిం జూచి జనకమహారాజు చాల మెచ్చుకొని సీతాదేవిని శ్రీరాముసకు సమర్పించెద నని పలికెను.

ఆపయిని దశరథునకు శుభలేఖ నంపఁగా నామహారాజు భార్యలతోను భరతశత్రుఘ్నులతోను పశిష్ఠాదిపరివారముతోను గలిసి మిథిలానగరమునకు వచ్చెను. అంతటఁ జనక