పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125

దూతకృత్యమగు సీతాన్వేషణాదికమును జరిపియుండినందున నారూపముతోనే మన మిప్పటికిని దేవాలయములలో నారాధించుచున్నాము. ఇందుకు తప్పుగాని యసందర్భముగాని యేమియు లే దని చదువరులకుఁ బోధపడఁగలదు.

8. విభీషణుఁడు.

ఇతఁడు రావణుని రెండవతమ్ముడు. సీతాదేవిని లంకకుఁ దెచ్చినపిదప ననేకపర్యాయములు రావణునితో వల దని హితోపదేశమును జేసెను. చివరకు దనయన్న యెంతమాత్రము తనమాటను వినఁ డనియుఁ, జెడు ననియుఁ దృఢముగఁ దెలిసికొని యతనివలన నవమానమును బొంది. నలువురుమంత్రులతో సముద్రమును దాఁటివచ్చి శ్రీరాములవారి సన్నిధిని శరణాగతి చేసెను. ఈశరణాగతివిషయము విష్ణుమతస్థులందరికి నిండా ముఖ్యము. ఇదియే షడంగప్రపత్తి యని చెప్పుదురు. షడంగప్రపత్తికి మోక్ష మే ఫల మై యుండవలెను. అట్లు లేదు. అయితే ఇచట లంకారాజ్యలాభమే ఫలముగ గ్రహింపవలసియున్నది. ఆపిదప శ్రీస్వామివారిసన్నిధిని జేరి రాక్షససేనల స్థితిగతులనన్నిటిని మనవిచేసెను. యుద్ధసమయమునందును రావణునికోటలోఁ జరుగుప్రతివిశేషమును మనవి చేయుచువచ్చినందున బ్రతీకారము వెంట వెంటనె చేయఁ