పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

బడుచుండెను. అంతటినుండియే 'యింటిగుట్టు లంకకుచేట'ను సామెత వాడుకలోనికి వచ్చెను. పూర్వ మాపత్కాలముల యందుఁ గనిష్ఠులగు సోదరులు సహా నీతులు చెప్పు మంచి యాచారము గలదు.

యుద్ధానంతరము. శ్రీరాములవారివలస లంకారాజ్యమున కభిషేకింపఁబడి యీవిభీషణుఁ డాస్వామివెంట నయోధ్యకు వచ్చి సన్మానమును బొంది తిరుగ లంకకుఁ బోయి రాజ్య మేలుచుండెను.

9. కుంభకర్ణుఁడు.

ఇతఁడు రావణాదిసోదరులు ముగ్గురిలో రెండవవాఁడు. విశేషౌన్నత్యము బలము గలవాఁడు. కాని తిండిపోతు. అతినిద్ర గలవాఁడు. ఐనను యుద్ధమధ్యమున దనయన్నకు రాజనీతిని విస్తారముగఁ జెప్పెను. రావణునిపనుపున యుద్ధమున కేగి శ్రీరాములవారిచే సంహరింపఁబడెను. శారీరశాస్త్రము నెరుగని యీగ్రంథకర్త కుంభకర్ణునిచే మ్రింగఁబడినవారు కర్ణనాసికారంధ్రములనుండి బయటికివచ్చు చుండి రని చిత్రముగ వర్ణించెను. ముక్కునకును నోటికిని రంధ్రము గలదు గాని చెవికిలోపల రంధ్రమే లేదు గదా? మ్రింగఁబడినవా రాదారి నెటుల రాఁగలరు?