పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

రాజసులమధ్య జన్మించినవారై యుండియుందురు. కేవలము నల్లనివారును నవయవసౌష్ఠవము తక్కువగలవారును రాక్షసులై యుందురు. అయితే ఈవానరులను గోఁతు లని నమ్మనివారు హనుమంతుఁడు సముద్రలంఘనము నెట్లు చేసె ననియు, తనతోఁకకు జుట్టఁబడిన చమురుగుడ్డల మంటతో లంకాదహన మెట్లు చేసె ననియు నిష్పటికిని విష్ణుదేవాలయములలోఁ దోక గల హనుమంతునిఁ నెటుల పూజించుచున్నా రనియు నాక్షేపింపక మానరు. దీనికి సమాధానము :- ప్రతిమతమునందును గొన్నిమతసంబంధమయిన నమ్మకములు గలవు. ఆనమ్మకములను విడుచుకొన్న యెడల నేమతమును నిలువఁజాలదు. అందు మనయార్యమతమున నవి హెచ్చుగ నున్నవి. కావున నట్టివాని నీకాలపువారును నమ్మవలసినదే ? ఆమతసంబంధములగు నమ్మకములలో నీమీఁదిచర్చకు సంబంధించిననమ్మకములను దీసికొనియెదము. అరుదుగఁ గొందరుమహానుభావులకు గామరూపములను ధరించుశక్తి గలిగియుండును. అటులనే హనుమంతునికిఁ గామరూపశక్తి కలిగియుండును. లంఘనమునకు యోగ్యమైన కోఁతిరూపమును ధరించి మహేంద్రగిరి నుండి సముద్రమును దాఁటియుండును. కోఁతిరూపముతో నుండినందున దోకకు జమురుగుడ్డలు చుట్టి రాక్షసులు కాల్చియుందురు. ఈహనుమంతుఁడు కోఁతిరూపముతోనే శ్రీరామ