పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

యొద్ద మంత్రిగ నుండినట్టు లయోధ్యలోని శ్రీహనుమంతుని దేవాలయమువద్ద గొందరు చెప్పియుండిరి.

5. వాలి.

ఇతఁడు కిష్కింధాదేశపురాజు. మాయావి యనువానితో దీర్ఘకాలము యుద్ధముచేసి మరలిరానందున నతని తమ్ముఁడుసుగ్రీవుఁ డన్న చచ్చియుండు నని భావించి రాజ్యమును స్వీకరించెను. అప్పటి యాదేశపుబ్రజల యాచారము ప్రకారము దనయన్న భార్యయగు తారనుఁ బరిగ్రహించెను. ఇట్లు కొంతకాలము జరిగినపిదప వాలి యాదనుజుని సంహరించి కిష్కింధకు వచ్చి తమ్ముడగు సుగ్రీవునిపయిని గోపించి యతనిని బయికి వెడలఁగొట్టి రాజ్యమును భార్యను మరియు నతనిభార్యను స్వీకరించెను. శ్రీరామసుగ్రీవసఖ్యానంతరమున శ్రీరాములవారిచే నీవాలి చంపఁబడెను,

6. సుగ్రీవుడు.

ఇతఁడు తనయన్నయగు వాలి యనంతరమునఁ గిష్కింధ నేలినప్రభు వయి యున్నాఁడు శ్రీరాములవారిపనువున నలుదిక్కులకు వానరవీరులను సీతాన్వేషణముకొరకుఁ బంపెను అసహాయులయిన శ్రీరామలక్ష్మణులకు దనయావత్సేనతో సహాయుఁడై లంకకుఁ బోయి రామరావణ యుద్ధమునఁ బోరాడి ప్రభుసుఁడు, కుంభుఁడు, మహోదరుఁడు మొదలగురాక్షస