పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121

వీరులనుఁ జంపెను. యుద్ధానంతరము శ్రీరాములవారితో వానరవీరులతోఁగూడ నయోధ్యకు వచ్చి శ్రీరామపట్టాభిషేక మయినపిదప వారివద్ద సెలవును బొంది కిష్కింధకుఁ బోయి రాజ్యము నేలుచుండెను.

7. అంగదుఁడు.

ఇతఁడు వాలికుమారుఁడు. సేతువు దాఁటినపిదప శ్రీరాములవారిపనుపున రావణునియొద్దకు రాయభారముకొర కేగి యనేకనీతివాక్యములను నతనితోఁ జెప్పెను. యుద్ధమున వజ్రదంష్ట్రుఁడు, నరాంతకుఁడు, కంపనుఁడు, ప్రజంఘుఁడు, మత్తుఁడు మొదలగురాక్షసవీరులనుఁ జంపెను. యుద్ధానంతరము శ్రీరాములవారివెంట నయోధ్యకు వచ్చి మరలఁ గిష్కింధకుఁ బోయెను. ఈవానరవీరులలోఁ జాంబవంతుఁడు వృద్ధు. నీలుఁడు సేనాధిపతి. నలుఁడు సేతువు గట్టినవాఁడు. సుషేణుఁడు వైద్యుడు.

ఇటుపైని రావణాదిరాక్షసులవిషయమై వ్రాయవలసి యున్నది. గనుక యీవానరు. లనువా రెవ్వరో కొంత చర్చించి వ్రాయుట సముచితము. వీరలను సాధారణముగ మనమందరము గ్రంథకర్తతోపాటుగఁ గోతు లని నమ్ముచున్నాము. కోతులే యయియుండినయెడల వారిస్త్రీలకు హస్తపాదాద్యాభరణములను ధరించుట కెట్లు వీ లగును?