పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

119

ముంచిన గుడ్డలు చుట్టి కాల్చుట యను శిక్షతో హనుమంతుని విడిచిపెట్టను. అంతట నతఁ డామండుచుండెడుతోకతో నూరంతయుం దగులబెట్టి తనక్షేమమును సీతకుఁ దెలిపి యామె కుశలమును విచారించి సముద్రమును దాటి తన నిమిత్తము కాచికొనియుండినకపులతోఁ గలిసి యందరి కానందమును గలిగించెను. సీతను జూచుటకుగా వచ్చి లంకాపురము నంతయు నితఁడు గాల్చినందున (చూచిరమ్మనిన కాల్చివచ్చినావా ?) అనుసామెత యప్పటినుండియు గలిగెను. ఇట్లు వానరు లందరు గలిసి శ్రీరాములవారివద్దకుం బోయినపయిని హనుమంతుఁడు శ్రీస్వామివారికిఁ జరిగినవృత్తాంతమును జెప్పి సీతాదేవియొక్కశిరోమణిని సమర్పించి యతనిహృదయతాపమును బోఁగొట్టెను. యుద్ధమునం దితఁడు జంబుమాలి, ధూమ్రాక్ష, అకంపన, దేవాంతక , త్రిశిరస్క, నికుంభ, కాలనేమి, మాల్యవంతు లను రాక్షసవీరులనుఁ జంపెను. యుద్ధానంతరమున నయోధ్యకు మరలివచ్చునప్పుడు శ్రీస్వామివారిపనుపున భరద్వాజాశ్రమమునుండి యీకపిశ్రేష్ఠుఁడు భరతునివద్దకు వెళ్లి శ్రీరాములవారిరాక నెఱింగించి సంతోషమును గలిగించెను. శ్రీరామపట్టాభిషేక సమయమున సీతాదేవి శ్రీస్వామివారిపనుపున నీహనుమంతునకు నమూల్యమైనముక్తాహారము బహు.మతి నిచ్చెను. ఇతఁడు శ్రీరామనిర్యాణానంతరము కుశలవుల