పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కావున ముహూర్త మనునది పదిమంది చేరుటకును నాపనికి గావలసిససంభారములు జాగ్రత్త పడుటకును వీలగు కాలసదు పాయమును గలిగించునే కాని వారివారి యదృష్టములను మార్పఁజాలదు.

3. సుమంత్రుఁడు.

ఇతఁడు దశరథమహారాజుయొక్క యష్టమంత్రులలో నొకఁడు. ఇతఁడును నిక్ష్వాకునివద్దనుండి క్రమముగ నా రాజుల కొకమంత్రిగ నున్నట్లు చెప్పఁబడి యున్నది. మహర్షి యగు వసిష్ఠునితో బాటుగ నితఁ డంతకాలము జీవించుటకుఁ గారణము గానరాదు. ఇతఁడు చేయుపని యేమి యనిన : అంతఃపుర స్త్రీలయొద్దకును, బుత్రాది బంధువులయొద్దకును వార్తలు నడుపుట. వారివారి సౌఖ్యములకు భంగము లేకుండునట్లు కనిపెట్టుట. అంతఃపురస్త్రీలు బయటికి వెడలునపుడు వారి రథసారథ్యము చేయుట మొదలగుపనులుగాఁ గనఁబడుచున్న వి. అంతఃపురసంచారమునకు వృద్ధుఁడగువాఁడే కాని యితరుఁడు పనికిరాఁడు గదా? ఆవృధ్ధత్వములోను వార్ధకము వలనఁ గలిగిన బుద్ధిలోపము లేనివాఁడుగ నుండవలెను. అట్టివానిని సుమంత్రుఁడు అనఁగా (యోగ్యమైన యాలోచనగల వాఁడు) అనువానిగా నేల చెప్పఁగూడదు ? కావున నాపనిలో నేర్పఱుపఁబడిన ప్రతిమంత్రికిని సుమంత్రుఁ డని