పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117

యుద్యోగనామము గలిగియుండును. అందువలన నిక్ష్వాకుని నాటినుండియును నున్నట్టు చెప్పఁబడిన యుద్యోగనాముఁడే యితఁడు. వృద్ధుఁ డగుటచే నప్పటినుండి యుండినవాఁ డని గ్రంథకర్త పొరపాటుపడి యుండును. ఇట్లనే కాలాంతరమునందేక నామమును ధరించినరాజులను సహా ఒక్కరుగానే మన గ్రంథకర్తలు తీసికొనుచున్నారు. ఇప్పటి మనచక్రవర్తిగారికి ఎడ్వర్డు అనునామము గలదు. ఈపేరు వారివంశజులలో లోగడ నార్గురికిఁ గలదు. కావున నీతఁ డేడవయెడ్వర్డు అని పిలువఁబడు చున్నాఁడు. మొదటి యెడ్వర్డు అనురాజు మొదలు ఒకటవ యెడ్వర్డు అను మొదలగు సంఖ్యానిర్దేశములతో వాడఁబడుచు వచ్చినందున మనము పూర్వులవలె నొక్కఁడే యని భ్రమయుటకుఁ బ్రసక్తి లేదు.

4. హనుమంతుఁడు.

ఇతఁడు సుగ్రీవునకు మంత్రి. అరణ్యవాసమున శ్రీరాములవారికిని సుగ్రీవునకును ఋశ్యమూక పర్వతమునందు సఖ్యము చేసెను. ఇతఁడు మిగుల బుద్ధిమంతుఁడు. వ్యాకరణశాస్త్రక్రవీణుఁడు. సమర్థుఁడు. సీతాన్వేషణముకొరకు శ్రీరాములవారిపనుపున సుగ్రీవుఁడు వానరులను బంపునపుడు దక్షిణదిక్కున కేగు వారితో నీహనుమంతునిఁ బంపెను. ఆదక్షిణదిక్కున సీతాదేవి యెచ్చటను గానరానందున రామేశ్వరమునందున్న మహేంద్ర