పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

రావణునికి దశముఖ దశకంఠాద్యపరనామములు కలవు. ఇందువలన హిందువులు నిజముగ నతనికి బదితల లున్నట్లు భ్రమపడుచున్నారు గాని రావణుఁడు నితర మనుజులవలె నేక ముఖఁడుగాని యనేక ముఖుఁడుగాడని మహారాజావారు వ్రాసియున్నారు. సయుక్తికముగ నాలోచించు శక్తిగలవారెవరు నీయభిప్రాయమునకు విరుద్ధముగ జెప్పలేరు. కార్తవీర్యార్జునునకు సహస్రబాహుఁడని పేరుగలదు. ఈయన దుష్టశిక్షణమందతి సమర్థుఁడని మన పురాణములలో నున్నది. కనుక దుష్టనిగ్రహమందు వేయిభుజములు గలవానివలె నుండెనని సహస్ర బాహుశబ్దమున కర్థము కావచ్చును. ఇటులనే దశముఖ దశకంఠాదిశబ్దములును వ్యంజనావృత్తి ప్రయుక్తము లనవలెగాని సర్వలోకానుభవ విరుద్ధమగు విచిత్రసృష్టి యితని విషయమై జరిగెనని యనుట యసమంజసము.

బహుకాలమునుండియు శ్రీరామకృష్ణులు భగవదవతారంబులని హిందూమతస్థులు పూర్ణముగా నమ్ముటచేత వారిచర్యలను వారి యుపదేశములను జెప్పుచున్న రామాయణ మహాభారత గ్రంథములు సకల విషయముల నుత్తమధర్మబోధకములుగ నెన్నఁబడి వానిలోనున్న ముఖ్యాంశములేగాక యముఖ్యాంశములు నసంగతములయిన కథలుగూడ విశ్వసనీయములని తలంపబడుచున్నది. మరియు నీ కారణముచేతనే పండి