పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv

తులుగూడ నీ కథలలో గొన్నిటిని నమ్మనిచో బ్రత్యవాయమగునను భీతిచే నా గ్రంథస్థములైన సమస్తవిషయములు గ్రాహ్యములే యనుచున్నారు.

మహారాజావారు పండితంమన్యులకువెరువక తమకు న్యాయ్యమని తోచినరీతి నందరిచేతను బ్రమాణగ్రంథములని యొప్పుకొనఁబడిన వానినిగూడ విమర్శించి సోపపత్తికముగ వీనిలోనిదిగ్రాహ్య మిది యగ్రాహ్యమని తెలుపుటకై యాంధ్రభాషలో మహాభారత రామాయణ విమర్శమను నీ గ్రంధమును జేసియున్నారు. ఈ గ్రంథ మాంధ్రభాషాభిజ్ఞులకు భారతరామాయణగ్రంథ తాత్పర్యమును సహేతుకముగ బ్రకటన చేయుటయేగాక పూర్వగ్రంథములను బరిశీలించుట కపూర్వమార్గమును జూపుచు గృతికర్తయుక్క వివిధభాషా గ్రంథావలోడన జనిత సంభావ్యా సంభావ్యవివేచన సామర్థ్యము నార్యమతాభి నివేశమును దెలుపుచున్న ది.

కడాంబి - రామానుజాచార్యులు,

( ప్రిన్సిపల్, మహారాజాస్ కాలేజి,)

విజయనగరం,

విజయనగరము

1907.


___________