పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

జేయుచున్నది. వసిష్ఠకథా సందర్భములో "నీయనచే నుంప బడిన పట్టాభిషేక ముహూర్తము కార్యకారి గాకపోవుటయే గాక శ్రీరాములవారి కరణ్యవాస కష్టమును గలుగజేసెను. కావున ముహూర్త మనునది పదిమంది చేరుటకును నా పనికి గావలసిన సంభారములు జాగ్రత్తపడుటకును వీలగు కాలసదు పాయమును గలిగించునేకాని వారివారి యదృష్టములను మార్పజాలద”ని మహారాజావారు వ్రాసియున్నారు. ముహూర్త విషయమున హిందువులందరును వీరి యభిప్రాయము కలవారై యున్నయెడల బ్రస్తుతము ముహూర్తవిశ్వాసమువలన గలుగు ననేక విపత్తులకు లోబడక సుఖ మనుభవింతురు.

శ్రీమన్నారాయణావతారములలో శ్రీరాములవారు స్వకీయ ప్రవర్తనముచే వివిధావస్థలయందు జనుల కుత్తమ ధర్మాచరణ రీతిని గనబరచియున్నారు. శ్రీరామచారిత్రమువలనఁ బితృవాక్య పరిపాలనము, భ్రాతృస్నేహము, మిత్రప్రీతి, ఏకపత్నీవ్రతము, సత్యసంగరత్వము మొదలయిన గుణములను, సీతాచరిత్రము వలన మహా పతివ్రతాలక్షణమును, లక్ష్మణ భరత శత్రుఘ్నుల చరిత్రమువలన స్వసుఖ నిరపేక్షముగ జ్యేష్ఠసోదరానువృత్తి మొదలయిన గుణములను జదువరులు నేర్చుకొనవలసి యున్నదని శ్రీ మహారాజావారు వ్రాసినది సర్వాంగీకార్యముగ నున్నది.