పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

దాపోషకత్వము వ్యాపించినది. సంస్కృతమునందు బతిశబ్దమునకు 'ప్రభువు' 'పోషకుఁడు' 'భర్త' యనునర్థములు గలవు. 'భూపతి' 'గృహపతి' 'జనపతి' ఇత్యాదులు. గనుక మితిలేని శృంగారకథలతో నిండియుండిన మనస్సులు గల గ్రంథకర్త లాపతిశబ్దమునకు బోషకుఁడను నర్థముం జేయక భర్తయను నర్థముం జేసియుందురు.

ఇంక పశ్చిమదేశపువిద్వాంసు లగు 'మాక్సుముల్లరు' మొదలగువారిచే నెవరియొక్క యుపదేశము లైకకంఠ్యముగ మెచ్చుకొనఁబడి యుండినవో యట్టి శ్రీకృష్ణులవారివిషయమై మన కిదివరలో గలిగియున్నట్టియు, లజ్జాకరములైనట్టియు, వారివారికిఁ దోచినటులఁ జెప్పఁబడినట్టియు, వారివారి యిష్టము కొలఁది విరివి జేయఁబడినట్టి విపరీతభావనలను మీకు సాధ్యమైనంతవరకు బోధపడు నటులుగ వ్యక్తపరిచితి నని తలంచుచున్నాఁడను, అట్టి యసత్యపునమ్మకమునుబట్టియేకదా మన వారిలో ననేకులు అనఁగా గతవర్తమానకాలములయం దుండువారు. పాపభూయిష్టములైనట్టియు బైని చెప్పఁబడినట్టియు, నసత్యములైనట్టియు ననేకములగుతప్పులను జేసియుండునటుల గనిపెట్టుట మిగుల లజ్జాకరమై యున్నది.

ఓస్నేహితులారా! పైఁ జెప్పఁబడినయుక్తులను బ్రమాణములను మసస్సునం దుంచి మన కిదివరకు శ్రీకృష్ణులవారి