పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103

(2) ఒకరాజు తనను జయించినరాజునకు దనకుమార్తెనుగాని, చెలియలనుగాని వివాహముకొరకు సమర్పించుట గలదు. అటుల సమర్పించుట, జయింపఁబడినవాని కిష్టముమీఁద నున్నదిగాని, జయించినవానికి మాత్ర మాచిన్నదానిని సంగతిసందర్భములనుబట్టి తనకుగాని తనకుమారునికి గాని వివాహము జేసికొనుట విధివిహితమైన యాచారమై యున్నది.

ఇట్టి యాచార సందర్భములవలన నొక భార్యకంటె నెక్కుడుమందిని వివాహ మాడి యుండవచ్చును. గాని స్త్రీలోలత్వముచేత గాదు. లేదా, మీఁద గనఁబరుపఁబడిన విషయములలోవలె గ్రంథకర్తల పొరబాటులుగ నైన నుండవచ్చును.

మరియొకచిన్నగాథ కలదు. శ్రీకృష్ణులవారు గొప్ప రాజగు నరకాసురుని సంహరించి యాతనియధీనమై యుండు యువతుల నందరిని వివాహ మాడిన ట్లున్నయది. ఈసంఖ్య బహుశః అతిశయోక్తికొరకు గ్రంథకర్తలచే బదియారువేలు మొదలు పదియారువేల నూటివరకు జెప్పఁబడి యున్నది. ఈపొరపా టెటుల జరిగినదో చూచెదము. ఆస్త్రీలందరికి నానరకాసురుఁడు పతి లేక పోషకుఁడై యుండెను. అతఁడు సంహరింపఁబడగానే స్వభావముచేతనే శ్రీకృష్ణులవారియం