పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

బదులుగ దురదృష్టముకొలఁది. బొరపాటుపడి మన మిప్పు డాగ్రంథములోఁ జూచురీతి ససత్యమైనట్టియు, దుష్టమైనట్టి యభిప్రాయమును బొందుటకుఁ గారణమైనది.

శ్రీకృష్ణులవారినిగురించి మరియొకస్వల్పాంశమును మీకు జెప్పవలసి యున్నది. వా రెనమండ్రుస్త్రీలను వివాహమాడిన ట్లున్నది. ఇందుకు నే నాక్షేపింపను గాని రుక్మిణీసత్యభామాజాంబవతులకు వినాగా మరికొందరు భార్య లుండినటుల మహాభారతమునందుఁ జెప్పఁబడి యుండలేదు. రుక్మిణీదేవికంటె నొకరిద్దరు స్త్రీలను వారు వివాహ మాడియుండినను నెనమండ్రుభార్య లుండినటులఁ దగినయుపపత్తి లేదు. అయినప్పటికి నొక భార్యకంటె నెక్కుడుమందిని వివాహమాడినటుల మన మొప్పక తప్పదు. కాన నేల నటుల జేసికొనిరో చూచెదము. ఆకాలములో నిరాకరింపఁబడదగని రెండాచారములు గలవు,

(1) ప్రతిరాజును వివాహమైనవాఁడు గాని, కానివాఁడు గాని, యొకరిచేఁ గోరఁబడినపుడు స్వయంవరమునకు దప్పక బోవలసిన దనియు, స్వయంవరమం దాచిన్నదానిచే వరింపఁ బడినచో నామెను దప్పక వివాహ మాడవలసిన దనియు నాచారము గలదు.