పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95

తీతుండును, దోషశూన్యుండును, అనవధికాతిశయకల్యాణ గుణగణుండును, సర్వజ్ఞుండును, జితేంద్రియుండు నని ప్రసిద్ధిని వహించిన శ్రీకృష్ణులవారు పాపకరమైనట్టియు, మోహూద్రేకమును గలిగించునట్టియు నిట్టికార్యములను జరిగించియుందురా విచారింపుడు! అది నిజము కాదు. మరి యే మనిన నప్పటికాలములోను, నరుదుగ నిప్పుడును , పర్వతవనవాసులలో స్త్రీపురుషులు కలిసి యాడుట, పాడుట, మనదేశమందు మామూలయియే యున్నది. ఇంతియెకాక నాగరికతగల యూరపుదేశస్థులకు సహా యటుల నాడుట మామూలు మర్యాదయయి యున్నది. ఈగ్రంథకర్త లట్టిప్రజలయొక్క మామూలుమర్యాదలను దెలియనివారై యారాసక్రీడకు విపరీతార్థమును దీసికొనిరి.

ఇక స్త్రీలయొక్కవస్త్రముల సపహరించిన విషయము శ్రీకృష్ణులవారు బాల్యావస్థ ననుసరించి వినోదార్థముగ జరిగించి యుండవచ్చును. లేదా స్త్రీలు వస్త్రవిహీనలై సరస్సులందును, నదులందును, స్నానములు చేయుఁగూడదని యుపదేశము జేయుకొరకు బహుశః అటుల జేసియుండ వచ్చును.

ఈవిధమగు నభిప్రాయముచేతనే బ్రాహ్మణస్త్రీలుకూడ నా గోపబాలురలో నాహ్లాదకరమగు, సౌకుమార్యముగల యా