పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

విపులముగను, హరివంశవిష్ణుపురాణములయందు స్వల్పముగను గలదు. ఇట్టివి మరి రెండంశములు భాగవతమునందుఁ జెప్పఁబడి యున్నవి.

(2) శ్రీకృష్ణులవా రొకసరస్సునందు వస్త్రవిహీనలై జలక్రీడ లాడుచుండుయువతుల వస్త్రముల నపహరించినటులను ;

(3) కొందరు బ్రాహ్మణస్త్రీలు శ్రీకృష్ణులవారిం జూచి మోహించినటులను గలదు.

ఇట్టి గ్రంథకర్తలయొక్క యసందర్భపు టూహలతో నిండియున్న యీకథలను గొంచెమైన దెలివి గలిగి యుక్తాయుక్త వివేచనముం జేయువారి కెవ్వరికిని నమ్ముటకు వీ లుండునా ? ఒకవేళ నాకథలు గ్రంథకర్తలయొక్క కేవలామాయికములైన పొరబాటులై బహుశః ఉండియుండవచ్చును. ఈ పైమూడు విషయములు జరుగునప్పటికి శ్రీకృష్ణులవారికి 11 సంవత్సరముల వయస్సు గలిగి యుండెను. అట్టిబాల్యావస్థలో నుండువారికి సంభోగవాంఛ గలిగియుండునా ! అయితే వారు సాధారణమైన బాలురు కా రనియు విష్ణు, లేక, మూలవిరాట్టుయొక్కయవతార మని కొందరు చెప్పవచ్చును. గాని యీవిధమైనయుత్తర మాకథలకు బలహీనతనే కలుగఁజేయుచున్న యది. మూలవిరాట్టుని యవతారమునుధరించినవారును, మనకు సృష్టికర్తయు, రక్షకుఁడును, సన్మార్గప్రదర్శకుండును, నింద్రియా