పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

బాత్రులై యున్నారు. బహుశః ఈగ్రంథకర్తలు యుక్తాయుక్త విచారసమర్థత లేనివారుగ గానవచ్చు చున్నారు.

ఈసంస్కృతపురాణములను దెనుఁగు, అరవము మొదలగు దేశీయభాషలలోనికి మార్చినకవీశ్వరులు, మరియు నవివేకులుగ గనిపించుచున్నారు. వీ రనేకవిషయములలో శ్రీకృష్ణులవారి చారిత్రములోని యొకభాగమును, ఇది యెట్టిసంగతి సందర్భములలో నెటుల జరిగినదో ముందు వెనుకల జూచి దానింగనిపెట్టుట కేవిధమైనశ్రమను బొందక క్రొత్తక్రొత్త ప్రబంధములనే కల్పించిరి. ఆకధలన్నియు నసత్యపుకథ లగుటయె కాక వారివారికిగల యభిరుచిని యుద్దేశమును శక్తినిబట్టి కేవలము స్త్రీలోలత్వమును జెప్పుకథలై యున్నవి. వారివారి మనోభిప్రాయముల ననుసరించి చెప్పఁబడినట్టియు, ససత్యములైనట్టియు, శ్రీకృష్ణులవారివిషయమై మనము దురదృష్టము కొలఁది జేయుచున్న విరుద్ధభానన లెవ్వియో యీక్రిందఁ జెప్పుచున్నాఁడను:-

(1) శ్రీకృష్ణులవా రొకనాఁటివెన్నెలకాలమందు రాసక్రీడలయం దాసక్తులయి యుండినటులను, అందు దామును యౌవనవతులగు స్త్రీలును గలిసి విహరించునటులను, నా యువతులు శ్రీకృష్ణులవారియందు మోహపరవశలైనటులను జెప్పఁబడియున్న ది. ఈరాసక్రీడవృత్తాంతము భాగవతమునందు