పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

మాటలాడు శక్తిగలవారనియు విలువగల కర్ణహస్తపాదాభరణములను ధరించియుండి రనియు వర్ణించిరి. పాము లైనచో వానికి గర్ణములు హస్తములు పాదములు నుండునా ! అవి యట్టియాభరణముల నెటులధరించెను. ఆయితే నా రెవరనిన యమునానదీతీరపుటడవులలో నివసించు నాగులను బేరు గల యొకజాతిప్రజలై యున్నారు. అందునుండియెకదా శ్రీకృష్ణులవారు కాళియు, నాయడవి విడిచిపోవలసిన దని యాజ్ఞాపించినటులను నాయుత్తరువుప్రకార మాతఁ డట్లు విడిచిపోయె ననియు జెప్పఁబడి యున్నది. ఈవిధముగనే యీగ్రంథ కర్త లనేక సంవత్సరములపిదప వ్రాసియుండుటంబట్టి యొకదానికి మరియొకటిగ భ్రమసియున్నారు. మరియెక చిన్న దృష్టాంతమును జెప్పుచున్నాను. కొందరుగ్రంథకర్తలు చెప్పుటలో శ్రీకృష్ణులవారు జన్మించినప్పుడు గాఢాంధకార మనియు, నపుడు విశేషవర్షము గురియుచుండిన దనియును, మరికొందరు చెప్పుటలో నారాత్రి యతిస్వచ్ఛమైనదియై యుండిన దనియుం జెప్పిరి. ఈవిధముగ బైవిషయములయందు గ్రంథకర్తలు భిన్నాభిప్రాయులై యుండుట చేత జదువరుల కేవిధమైన చెరుపును సంభవింపకపోయినను మనయార్యమతస్థులందరి దురదృష్టముకొలఁది. నాగ్రంథకర్తలు విశేషపాతిత్యకరములగు నట్టియు వచించుటకు లజ్జాకరములగు కేవలాసత్యదోషములకు