పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

పిల్లవానినిఁ జూచి యతిప్రేమ గలవారై యుండవచ్చును. మగవారికంటె స్త్రీలు పిల్లలను జూచునపుడు హెచ్చుగ బ్రేమించుట స్వభావగుణమైయున్నది. ఇంక నాభగవంతుని విషయమున జెప్పనేల !

అవతారములవిషయమై ఆనిబిసెంటుదొరసాని యిచ్చిన యుపన్యాసములలో శ్రీకృష్ణులవారి విషయమై యాయువతులకు గల నిష్కల్మషమైనట్టియు, భక్తియుక్త మైనట్టియు, బ్రేమను వ్యక్తపరచుట కింతకంటె జెప్పుట కెక్కువమాటలు లేవని చెప్పుచు నీవిషయములలో విశేషపరిశీలనజేసినచో సంభోగ వాంఛతో గలీసినయుద్దేశ మేమియు లేనటుల స్పష్టపడగలదని చెప్పెను.

పై మూడువిషయములు, 'ధీరేంద్రనాద్ ' గారు కూడ నిరుత్తరమగువిధమున నాక్షేపించిరి. వారు చెప్పిన దే మనిన ఈయంశములలో నేమాత్రము నిజ ముండినను మహాభారతమునందు సభాపర్వమున శిశుపాలుఁడు శ్రీకృష్ణులవారిని నోటికి వచ్చినటులఁ దూషించునపుడు వారియొక్క యిట్టివ్యభిచారములనుగురించి ధూషింపక యుండునా యని నుడివెను. మరియు నాగ్రంథమునం దెచ్చటను శ్రీకృష్ణులవారు స్త్రీలోలు లని చెప్పఁబడియుండలే దనియు, అంతకు నవీసగ్రంథమగు