పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

గ్రంథ మని యెంచవచ్చును. ఈగ్రంథములు శ్రీకృష్ణులవారి కాలముపిదప ననేకశతసంవత్సరముల తరువాత వ్రాయఁబడినవని నందుకు రుజువుగా నే నొకటి రెండు దృష్టాంతములను జూపించు చున్నాను. వానినిఁబట్టి యీపురాణములలోఁ గల పరస్పరభేదములును, అందునుబట్టి మనమనస్సుల నాటియున్న యసత్యపుభావనలును దెలియును.

(1) శ్రీకృష్ణులవారు బాల్యమునందు, బూతనవలనఁ జంపఁబడక విడువఁబడి రని యున్నది గదా! భాగవతములోఁ బూతన ఖేచరిగా శ్రీకృష్ణులవారినిఁ జంపుటకు వచ్చి నని చెప్పఁబడి యున్నది. హరివంశములో నాపూతన కంసునిదాదీ యని చెప్పఁబడి యున్నది. భాగవతములో మరియు నది భయంకరమైనరాక్షసి యని యెన్నఁబడి యున్నది. అయితే విష్ణుపురాణములో బిల్లలను జంపునది యని మాత్రము చెప్పఁబడియున్నది. శిశుఘాతిని యనునామమునకుఁ బదులుగా గంసుని దాది యని హరివంశములోను భీతికరమైనరాక్షసియని భాగవతములోను జెప్పఁబడియుండును. ఇట్లుండగా, 'ధీరేంద్రనాద్ పాల్ ' గారు పూతన యనునది యొకవిధమైన భయంకరమైన శిశువ్యాధి యని చెప్పుచు వైద్యవిషయమునఁ బ్రశస్తములగు గ్రంథములలో నొకటి యగు శుశ్రుత మను దానిలో నిదియొక వ్యాధి యైనటులఁ జెప్పబడిన దని గొప్పయాధారమును